మహేష్ ” గుంటూరు కారం ” లో నుంచి అదిరిపోయే ఫస్ట్ కటౌట్…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ మసాలా ” గుంటూరు కారం ” పై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, హైపర్ ఆది, సునీల్ జయరాం, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలలో పోషిస్తున్నారు.

హారిక హాసిని క్రియేషన్ సంస్థ గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవలే మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి రెండు సాంగ్స్ తో పాటు తాజాగా రిలీజ్ అయిన కుర్చీ సాంగ్ ప్రోమో సూపర్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. అదేవిధంగా ఈ సాంగ్స్ తో మూవీ పై మరింత హైప్స్ ని నెలకొల్పాయి.

ఇక అసలు మేటర్ ఏమిటంటే.. గుంటూరు కారం నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ కటౌట్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి అప్సర థియేటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కటౌట్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా బీభత్సంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందుకు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.