” బిగ్ బాస్ – 7 ” గ్రాండ్ ఫినాలే కి పాన్ ఇండియా రేంజ్ లో రికార్డ్ రేటింగ్… ఏమయ్యా స్టార్ మా బానే సంపాదించావుగా…!

ఇటీవలే స్టార్ మా చానల్లో ప్రసారమైనటువంటి బిగ్ బాస్ 7 ఎంత గ్రాండ్ గా మొదలైందో అంతే గ్రాండ్ గా ముగించేశారు కూడా. అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన ఈ షో యొక్క 7 వ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా.. అమర్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయం ఏమిటంటే..డిసెంబర్ 17న ప్రసారం అయినా గ్రాండ్ ఫినాలే కి ఏకంగా 21.7 TVR లభించిందని.. ఒక రకంగా ఇది పెద్ద రికార్డ్ అని.. ఇంతటి ఆదరణ తమ షో కి అందించిన ప్రేక్షకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ స్టార్ మా ఛానల్ వారు కొద్దిసేపటి క్రితమే తమ సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు.

అదేవిధంగా రాబోయే బిగ్ బాస్ 8 నీ వారు మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం వీరు షేర్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఈ సీజన్ కొచ్చిన రేటింగ్ చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులని సృష్టించిందని ఈ సీజన్ కి వచ్చిన రేటింగ్ చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్ లో రికార్డుని సృష్టించినట్లు ఉంది. స్టార్ మా వాళ్లు బాగానే సంపాదించినట్టున్నారు కదా ” అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.