ప్రభాస్ ” కల్కి ” పై అంచనాలు పెంచుతూ ట్రైలర్ డేట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్…!

రెబల్ స్టార్ ప్రభాస్ ” కల్కి ” మూవీ కోసం రెబల్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సలార్ను మించి ఈ సినిమా మరింత విజయవంతం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత నాగ్ అశ్విన్ బొంబే ఐఐటీ టాక్ ఫెస్ట్ ఈవెంట్లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.‌..” కల్కి 2898 ఏడు మూవీలో ఫైట్స్ ఉంటాయి. అభిమానులంతా ఈ ఫైట్స్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తాము.

కల్కి అనేది చాలా శక్తివంతమైన పేరు. ఇది అయితేనే కథకు సరిపోతుందని దీనిని ఓకే చేశాము. అలాగే ఈ సినిమా ఎన్ని భాగాలు ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తాము. ఈ సినిమాలో ఫ్యూచర్ ప్రభాసును చూస్తారు. అలాగే కల్కి ట్రైలర్ 93 రోజుల తర్వాత వస్తుంది ” అంటూ చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈయన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.