మహేష్ ” గుంటూరు కారం ” పై లేటెస్ట్ అప్డేట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ పనులు సర్వేగంగా కంప్లీట్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయట.

ఇక మిగతా సగం కూడా త్వరలోనే త్రివిక్రమ్ అండ్ టీం ఫినిష్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది. చూడాలి మరి ఈ గ్యాప్ లో ఎలాంటి అప్డేట్స్ అండ్ ట్రీట్ లు ఇస్తారు. ఇక థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్గా నిర్మిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.