విజయ్ దళపతి పై చెప్పు విసిరిన వ్యక్తి… వైరల్ అవుతున్న వీడియో…!

ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది అయిపోతుంది అన్న సమయంలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు, డిఎండికే పార్టీ అధినేత విజయ్ కాంత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ డిసెంబర్ 28వ తారీఖున కన్నుమూశారు.

ఇక ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. డిఎండీకే ప్రధాన కార్యాలయంలో విజయ్ కాంత్ పార్థివదేహాన్ని ఉంచగా.. ఈయనకు అందరూ నివాళి అర్పిస్తూ.. కెప్టెన్ ఫ్యామిలీని ఓదార్చారు.

ఇక ఈ క్రమంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా విజయ్ కాంత్ కు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలోనే తోపులాట జరగడంతో గుర్తు తెలియని వ్యక్తి విజయ్ పై కి చెప్పు విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీంతో ఆ వ్యక్తిపై ఫాన్స్ విరుచుకుపడుతున్నారు.