బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున సలార్.. మూడు రోజుల్లో ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ పేరు ఎక్క‌డ చూసిన మారుయోగిపోతుంది. సలార్‌ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేస్తున్నాడు రెబ‌ల్ స్టార్‌. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్ళ‌ వర్షం కురుస్తుంది. ఇక మూడు రోజుల్లో ఏకంగా సలార్‌ ప్రపంచవ్యాప్తంగా రూ402 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టడం అంటే సాధారణ విషయం కాదు.

తాజాగా ఈ విషయాన్ని సరికొత్త పోస్టర్ రూపంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. కేవలం మూడు రోజుల్లో ఏకంగా రూ.402 కోట్లు కొల్లగొట్టడంతో ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో రూ.1000 కోట్ల క్లబ్లో చేర‌టం ఖాయం అంటూ త‌మ అభిప్ర‌యాని వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్, జగపతిబాబు, శ్రియ రెడ్డి, ఈశ్వరి రాపు కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఇక ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మరొకసారి ప్రశాంత్ త‌న మార్క డైరెక్ష‌న్‌తో హ్యాట్రిక్‌ హిట్ సొంతం చేసుకున్నాడు.