వామ్మో..వరుణ్-లావణ్య మధ్య ఇంత ఏజ్ గ్యాపా..తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

వరుణ్, లావణ్యాలు గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ… ప్రస్తుతం పెద్దలకి చెప్పి వారి వివాహానికి ఒప్పించారు. వీరి వివాహం నిన్న ఇటలీలో అంగరంగ వైభోగంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ముహూర్తాలు పెట్టినప్పటి నుంచి… ఏదో ఒక వార్తతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.

ఇక వీరి రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్లో జరగనుంది. ఇదిలా ఉండగా తాజాగా వరుణ్, లావణ్యాలకు సంబంధించిన మ‌రో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? వరుణ్ పెద్దోడా? లావణ్య పెద్దదా? అనే సందేహాలు చాలామందిలో కలిగాయి.

వీరిద్దరి మధ్య కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ మాత్రమే ఉంది. వరుణ్ జనవరి 19 , 1990లో జన్మించాడు. లావణ్య డిసెంబర్ 15, 1990లో జన్మించింది. అయితే దీనిబట్టి చూసుకుంటే వీరి మధ్య ఏజ్ గ్యాప్ పెద్దగా లేనట్టే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.