అరుదైన అవకాశాన్ని కొట్టేసిన రామ్ చరణ్.. ఈసారి ఏకంగా దానికే ప్లాన్ వేశాడుగా…!

మెగా హీరో చరణ్ కు మరో అరుదైన ఆపెర్చునిటీ దక్కింది. “ఆర్ ఆర్ ఆర్ ” సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అకాడమీ లోని యాక్టర్స్ బ్రాంచ్ లో చేర్చుకున్నట్లు.. అకాడమీ తాజాగా ప్రకటించింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా యాక్టర్స్ బ్రాంచ్ కొత్త లిస్టును పోస్ట్ చేసింది. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును కూడా అనౌన్స్ చేసింది. ఇక కొత్తగా ఏడుగురు నటులు.. యాక్టర్స్ బ్రాంచ్ లో చేరగా ..ఇప్పటికే ఇండియా నుంచి తారక్ ఈ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు చరణ్ ఈ జాబితాలో చేరడంతో.. మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో..” గేమ్ చేంజర్ ” సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.