” నేను చేసే పనులకు… నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తాడేమో “… ప్రేమ కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ…!!

బిగ్ బాస్ 7 రోజు.. రోజుకి మరింత రసవత్తంగా సాగుతుంది. గడిచిన ఏడు వారాలలో అమ్మాయిలు ఎలిమినేట్ కాగా… గత ఎనిమిదో వారం మాత్రం అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు. ఇక నామినేషన్స్, గొడవలు, గేమ్స్ ఇవన్నీ పక్కన పెడితే.. బిగ్బాస్ హౌస్లో జంటలకు మాత్రం కొదవ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కరితో ప్రేమని పండిస్తున్నారు. తేజ, శోభ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్బాస్ ఈవారం అమ్మాయిలకు అందరికీ అబ్బాయిలు సేవలు చేయాలని ఆదేశించడంతో.. ” శోభ, తేజ తో పళ్ళు తోమించుకోవడం.. ఫుడ్ తినిపించుకోవడం లాంటివి చేపించుకుంది.

ఎత్తుకు వెళ్ళమని సైతం అడిగింది.. ఎందుకు ఎత్తుకోవాలి అని తేజ అడగగా.. భార్యకు ఏదైనా సమస్య వస్తే భర్త ఎలా చూసుకుంటాడు అని ప్రశ్నించింది. తేజ అయితే ఏకంగా బిగ్ బాస్ మేము ఇద్దరం భార్యాభర్తలం.. మా పెళ్ళికి మీరు రావాలి ” అంటూ రెచ్చిపోయాడు. చివరగా తేజతో, శోభ తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ.. ” బయట నేను ఎలా ఉన్నానో బిగ్ బాస్ ఇంట్లో కూడా అలాగే ఉన్నాను. కానీ చూసే వాళ్లకు వేరే విధంగా కనిపించవచ్చు కదా. అరవడం గురించి అయితే అతనికి తెలుసు.. కానీ అది కాకుండా ఇంకేదైనా ఉందేమో చెప్పలేం కదా “…అని అన్నది శోభ.

శోభ ఇంకా మాట్లాడుతూ.. ” వాడు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. కానీ ఒక్కొక్కసారి తప్పుదారిలో ఆలోచించడం జరుగుతుంది. తేజ నేను నీతో కలిసి ఉండడం అతనికి నచ్చకపోవచ్చు. ఇవన్నీ తప్పుగా అర్థం చేసుకుని నన్ను వదిలేస్తే నేను తట్టుకోలేను ” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు..” ఆ బుద్ధి ముందు ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం. అయినా నీలాంటి దాన్ని భరిస్తున్నాడు అంటే వాడు ఎంత గొప్పోడు..” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.