బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ జంటల్లో ఈ జంట కూడా ఒకటి. గతంలో వీరిద్దరికి ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా విరుష్క అని పేరు పెట్టుకున్నారు. కాగ మ్యారేజ్ అయిన తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది.
దీంతో పెళ్లికి ముందు అనుష్క ఓ ఇంటర్వ్యూలో.. పెళ్లయిన తర్వాత ఫ్యామిలీ బాధ్యతలను మోయడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైన ఆశ్చర్య అవసరం లేదు అంటూ చేసిన కామెంట్స్ ను వైరల్ చేశారు.
ఇండస్ట్రీలో ఇక వర్క్ చేయదు అంటూ వార్తలు వచ్చాయి. అదేవిధంగా అనుష్క ప్రెగ్నెంట్ అని మరోసారి తల్లి కాబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్తలు కేవలం పుకార్లు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వార్తలన్నిటికీ చెక్ పడే విధంగా వీడియోస్ సోషల్ మీడియాలో లీక్ అయింది.
అనుష్క – విరాట్ తమ రెండో బిడ్డను స్వాగతించడానికి రెడీగా ఉన్నారు.. అనే విధంగా ఆ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో అనుష్క బేబీ బంప్‌తో విరాట్ తో కలిసి నడుస్తూ కనిపించింది. దీంతో వీరిద్దరూ మరోసారి తల్లిదండ్రులు అవుతున్నారని న్యూస్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవడంతో విరాట్ , అనుష్క ఫ్యాన్స్ ఈ జంటకు విషస్ తెలియజేస్తున్నారు.
Virushka in Bangalore 🧿💘 pic.twitter.com/feLpF35i09
— Alaska • WC Era🏏 (@alaskawhines) November 9, 2023