చిరు, నాగ్, వెంకీ కాంబోలో మూవీ చేయడానికి రెడీ అయిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. సెట్స్ పైకి రాకపోవడానికి కారణం అదే..

సినీ ఇండస్ట్రీలో చాలాసార్లు సెట్స్ పైకి వచ్చిన మూవీస్ రిలీజ్ కాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మల్టీస్టారర్ గా రూపొందించాలనుకున్న సినిమాలు కూడా ఏవో కారణాలతో పక్కన పెట్టేస్తూ ఉంటారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున కాంబోలో ఓ మూవీ రూపొందించాలని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు అనుకున్నారట. కాగా ఆ సినిమా సెట్స్ పైకి రాక‌ముందే ఆగిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? ఏ కారణాలతో ఆగిపోయిందో..? ఇప్పుడు చూద్దాం. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఎన్నో ద‌శాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాఘవేంద్రరావు తన 100వ‌ సినిమా ను నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ కాంబోలో మల్టీస్టారర్ గా రూపొందించాలనుకున్నారట. ఈ సినిమాకు త్రివేణి సంగమం అని పేరు పెట్టాలని కూడా డిసైడ్ అయ్యాడట. బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాను ఎలాగైనా రూపొందించాలని ఫిక్స్ అయ్యాడట రాఘవేందర్రావు. దీని కోసం కథను కూడా సిద్ధం చేసుకున్నారట. ఆ టైంలో అక్క‌డికి వ‌చ్చిన‌ అశ్వినీ దత్ రాఘవేంద్రరావు గారితో మాట్లాడుతూ.. ముగ్గురు హీరోలను పెట్టి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు.

ముగ్గురి క్యారెక్టర్ కు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పైగా వారు ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్. వారి ముగ్గురిలో ఎవరి క్యారెక్టర్ అయినా కాస్త తక్కువగా అనిపించిందంటే ఫ్యాన్స్ మధ్యన గొడవలు మొదలవుతాయి. సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడట. ఇది విన్న రాఘవేందర్రావు అశ్వినిద‌త్‌ చెప్పినది కూడా నిజమే.. వీళ ముగ్గురు క్యారెక్టర్ డిజైనింగ్‌లో ఏ కొద్దిగా తేడా జరిగిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.. అంత రిస్క్ చేయడం ఎందుకులే అని భావించి ఆ ఆలోచ‌న మ‌నుకున్నాడ‌ట రాఘ‌వేంద్ర‌రావు గారు.

ఇక త‌న 100వ సినిమాగా అల్లు అర్జున్‌తో గంగోత్రి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా వచ్చి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేది అంటూ.. వారు ముగ్గురు కాంబినేషన్ ఫ్యూచర్లో అయినా వస్తే బాగుండు అంటూ.. వారి కాంబినేషన్ ఎలా ఉండేదో అంటూ.. ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.