ఆరు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం చాలా అంగరంగ వైభవంగా అతి తక్కువ బంధువుల సమక్షంలోని జరిగింది. ఈ జంటను ఆశీర్వదిస్తూ పలువురు నెటిజెన్లు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే కట్నం విషయంలో వరుణ్ తేజ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తనకు ఎలాంటి కట్న కానుకలు వద్దని అదే సమయంలో పెళ్లి ఖర్చులు కూడా తమ కుటుంబమే భరిస్తుందని తెలియజేసినట్లు సమాచారం.. కట్నం విషయంలో ఇలా నిర్ణయం తీసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటుంది.. ఈ విషయంలో వరుణ్ తేజ్ విషయాన్ని తెలుసుకుని అభిమానులు మెగా అభిమానులు సైతం ప్రశంసిస్తూ ఉన్నారు. గతంలో గని, గాండీవ దారి అర్జున వంటి సినిమాలతో భారీ ఫ్లాపులైన వరుణ్ తేజ్ గా అనే అక్షరం పెద్దగా వచ్చి రాలేదని తెలుస్తోంది. మరి కొంతమంది మాత్రం వరుణ్ తేజ్ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయకపోతే కెరియర్ చాలా ఇబ్బందులలో పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలుపుతున్నారు
మరి లావణ్య త్రిపాఠి ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన అదృష్టం కలిసి వస్తుందేమో అంటూ పలువురు అభిమానులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రాలలో మట్కా సినిమాతో పాటు మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.లావణ్య త్రిపాఠి కూడా ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్న అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. మరి వివాహమైన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమవుతుందేమో చూడాలి.