చలికాలంలో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే… తింటే అంతే ఇక…!!

చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటు కొన్నిటిని దూరంగా పెట్టడం ముఖ్యం. పండ్ల రసాలు, శీతల పానీయాలు, కేకులు వంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇలా పంచదార అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది.

ఇవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన వెంటనే ఆహారాన్ని తినవద్దు. అది గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక మాత్రమే తినాలి. అలాగే డీప్ ఫ్రై చేసిన ఆహారాలు వంటివి అసలు తినకూడదు. ఇలాంటి కొవ్వు పదార్థాలు చలికాలంలో చాలా ప్రమాదం.

ఆస్తమా వ్యాధితో బాధపడేవారు చలికాలంలో పాల ఉత్పత్తిని తగ్గించండి. గుడ్డు, పుట్టగొడుగులు వంటివి కూడా మితంగా తీసుకోవాలి. చలికాలంలో తప్పనిసరిగా ఈ ఆహారాలను దూరం పెట్టాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.