టేస్టీ తేజ ఎలిమినేషన్.. సందీప్ ఇన్ స్టా స్టోరీ వైరల్..

బిగ్‌బాస్ ఈవారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ పై చర్చలు బాగా కొనసాగుతున్నాయి. ఓపక్కన శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుందంటూ మరో పక్కన టేస్టీ తేజా ఖ‌చ్చితంగా ఎలిమినేట్ అవుతాడంటూ త‌మ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు జ‌నం. ఇక బిగ్‌బాస్ హౌస్ లో మొదటివారం నుంచి తేజ ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్ చేసిన వారిలో ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే అందులో టేస్టీ తేజ నామినేష‌న్స్ మూడో వారం నుంచి ఎవరినైతే చేస్తున్నాడో వారంతా వరుసగా హౌస్ నుంచి బయటకు వచ్చేసారు.

మూడో వారంలో దామిని, నాలుగో వారం రతిక, ఐదో వారం శుభక్ష‌, ఆరో వారం న‌య‌ని, ఏడవారం పూజ, ఎనిమిదో వారం సందీప్ ఇలా వరుసగా అందరూ బయటికి వచ్చేయడంతో టేస్టీ తేజకు ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చేసింది. అయితే వరుసగా అందరిని బయటకి పంపిన తేజ ఇప్పుడు తనే బయటకు వస్తున్నాడు అంటూ నెటిజ‌న్లు కామెంట్ల‌ వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే తేజా ఎలిమినేషన్ విషయం అధికారిక‌ ప్రకటన రాకపోయినా సరే పలు మీమ్ పేజ్‌ల‌పై తేజ ఎలిమినేటెడ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక చివరిగా హౌస్ నుంచి వచ్చేసిన్న సందీప్.. తేజ ఎలిమినేషన్ పై స్పందించాడు.

తన ఇన్‌స్టాస్టోరీలో సందీప్ అందర్నీ ఎలిమినేట్ చేస్తూ చివరికి తానే ఎలిమినేట్ అయ్యాడు అంటూ తేజ ఎలిమినేటెడ్ అని ఉన్న ఒక మీమ్‌ షేర్ చేశాడు. అంతేకాదు పాజిటివ్ వైబ్‌ అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దీనికి కారణం గతంలో సందీప్ ఎలిమినేషన్‌కు టేస్టీ తేజ కూడా ఒక కారణం. సందీప్ స్ట్రాంగ్ కంటిస్టెంట్ అనే పిచ్చి కారణం చెబుతూ తేజ సందీప్ ని నామినేట్ చేశాడు. ఈ కారణంగానే సందీప్ నామినేషన్స్ లోకి వెళ్లి ఎలిమినేట్ అయ్యాడు.

 

ఇక సందీప్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో జరిగిన నామినేషన్స్ లో శివాజీ ఈ విషయంపై తేజను నామినేట్ చేయగా.. సందీపే నన్ను నామినేట్ చేయమని స్వయంగా చెప్పారు అందుకే నామినేట్ చేశాను అంటూ అబద్ధం చెప్పాడు. సందీప్ దీనిపై స్పందిస్తూ ఇది పూర్తిగా ఫేక్ అని హౌస్ లో ఒక వ్యక్తి లేనప్పుడు అతనిపై ఇలా అబద్ధాలు చెప్పడం ఒకటి చాలు వాడిని హౌస్ నుంచి బయటకు లాకురావడానికి అంటూ ఫైర్ అయ్యాడు. ఇక ఇప్పుడు తేజ ఎలిమినేషన్ పై రియాక్ట్ అవుతూ ఇన్స్టాల్ స్టోరీ పోస్ట్ చేశాడు సందీప్. అందరినీ ఎలిమినేట్ చేస్తే చివరికి తానే ఎల్బినెట్ అయ్యాడు అంటూ తేజ పై క్యాప్షన్ ఇచ్చాడు.