కేజిఎఫ్ యాక్టర్ కి నోటీసులు.. అసలు విషయం ఏమిటంటే..?

కే జి ఎఫ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇందులో మాళవిక అవినాష్ కూడా నటించింది. ఈమె నటి మాత్రమే కాకుండా బిజెపి నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకుంది.. ఈమెకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మాళవిక అవినాష్ ఎంతో మందిని బెదిరింపు మెసేజ్లు కాల్స్ పంపించిందని ట్రామ్ ఆరోపించడం జరిగింది. మాళవిక అవినాష్ ఈ విషయం పైన వివరిస్తూ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సందేశం ఇచ్చింది.


మాళవిక అవినాష్ తన కొడుకుతో కలిసి ఉంటోంది. ఆమె పలు కన్నడ సినిమాలలో కూడా నటించింది. కే జి ఎఫ్1,2 వంటి చిత్రాలలో నటించి మరింత పాపులారిటీ అందుకుంది. ఇటీవలే ఈమెకు ట్రాయ్ ఫోన్ చేసి చాలామంది బెదిరింపు సందేశాలు పంపించడంతో ఈమె మొబైల్ చేసినట్లుగా సమాచారం.. దీంతో అవాక్కైన ఇమె ఏం జరిగిందో తెలుసుకోవడం జరిగింది.. మాళవిక అవినాష్ ఆధార్ కార్డుతో ముంబైలో ఒక అజ్ఞాత వ్యక్తి సిమ్ కార్డును కొనుగోలు చేసి ఆ నెంబర్ నుంచి పలు రకాల బెదిరింపు కాల్స్ మెసేజ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇలాంటి బెదిరింపు మెసేజ్లు రావడంతో ఆ నెంబర్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సిమ్ముకు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు అది మాళవిక అవినాష్ ఆధార్ కార్డు అని తేలిందట. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని సైతం ఈమె సోషల్ మీడియాలో పంచుకుంది.. తన ఫోటో ఉన్న డాక్యుమెంట్ ని మరెవరో ఎలా ఉపయోగిస్తున్నారో అంటూ తనకు తెలియడం లేదని ఆశ్చర్యాన్ని తెలిపింది. కేసు పై ఫిర్యాదు చేయడానికి ముంబైకి వెళ్లడానికి నిరాకరించిన ఈమె స్టేట్మెంట్ దాఖలు చేయడం జరిగింది. చివరికి వీడియో కాల్ ద్వారా ముంబై పోలీసులతో మాట్లాడింది మాళవిక. తన పేరు మీద అక్రమంగా జారీ చేసిన సింహం రద్దు చేసినట్లు సమాచారం.