బోల్డ్ యాంకర్ అనసూయ హీరోయిన్ అవకాశాలు కోల్పోవడానికి కారణం అదేనా.. ?!

బుల్లితెర కామెడిషో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ అనసూయ. రంగస్థలం మూవీలో రంగమ్మ అత్త పాత్రలో మెప్పించిన అనసూయ తరువాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను అత్తారింటికి దారేది సినిమాలో పాటలో నటించకపోవడానికి కారణాన్ని వివరించింది. ఒకప్పటి కంటే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని అని చెప్పుకొచ్చింది. అత్తారింటికి దారేది మూవీ లో ఓ పాట లో అవకాశం నాకు వచ్చిందని. అందులో ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారని.. నేను చేయను అని చెప్పా.

గుంపులో ఒకరిగా నటించడం నాకు నచ్చదు. నాకంటూ ఒక్క ప్రత్యేకత ఉండాలని కోరుకుంటా అందుకే ఆ పాటకు నో చెప్పా. ఆ అవకాశాన్ని తిరస్కరించినందుకు చాలా మంది నాపై బ్యాడ్ కామెంట్స్‌ చేశారు. నేను చెప్పడం తప్పు కాదు కానీ నో చెప్పే విధానం తప్పేమో అని నాకు అనిపించింది. మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడడం నాకు అలవాటు. అది కఠినంగా అనిపించిందేమో.. ఆ పాటలో నటించినందుకు ట్విట్టర్ లో నాపై పెద్ద వార్‌ జరిగింది. దీంతో త్రివిక్రమ్ కి సారీ చెప్పాను అంటూ అనసూయ వివరించింది. ఇక అనసూయ మాట్లాడితే షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుంటూ ఉంటాను. సినిమా అయ్యాక‌ జరిగే పార్టీలకు నాకు సంబంధం ఉండదు.

ఈ కారణంగా హీరోయిన్ అవకాశాలు కూడా కోల్పోయా. అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు ఇస్తాము అంటే నేను వాటిని ప్రోత్సహించను. ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే అందులో నాకే ప్రాధాన్యం ఉండాలనుకున్న. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా నా నటనతో గుర్తింపు తెచ్చుకోగలనని నమ్మకం ఉంది అంటూ వివరించింది. మాట్లాడితే ప్రతి మహిళ స్వేచ్ఛ కావాలని కోరుకుంటుంది. నా భర్త నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఇంటిలోని మహిళలను తలుచుకుంటే నాకు జాలి వేస్తుంది. బ్యాడ్ కామెంట్స్ ట్రోల్స్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు.. అయితే నా పోస్టులు చూసి స్ఫూర్తి పొందే వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు అంటూ వివరించింది.