పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన జబర్దస్త్ కిరాక్ ఆర్పి..!!

తెలుగు బుల్లితెర పైన ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కమెడియన్ జబర్దస్త్ కిరాక్ ఆర్పి. ఈ షోలో తనదైన పంచులతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్పి.. పలు సినిమాలలో నటించడం కూడా జరిగింది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బిజినెస్ వైపుగా అడుగులు వేస్తూ ఈ మధ్యనే పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ను ఓపెన్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు .ఎన్నో చోట్ల తదితర బ్రాంచ్ లు ఓపెన్ చేసి మరింత క్రేజ్ అందుకున్నారు కిరాక్ ఆర్పి.

ఈ కర్రీ పాయింట్ని మంత్రి రోజా చేతులు మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సడన్గా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు కిరాక్ ఆర్పి. అది కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో గోప్యంగా ఉంచి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.కిరాక్ ఆర్పి భార్య పేరు లక్ష్మీ ప్రసన్న గత ఏడాది వీరిద్దరికి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం చేసుకున్నట్లు సమాచారం.

ఈ జంటకు సంబంధించి పలు రకాల వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .ఈ పెళ్లి ఫోటోలు చూసి పలువురు నెటిజన్లు అభిమానులు సైతం కిరాక్ ఆర్పి దంపతులకు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కిరాక్ ఆర్పి భార్యది విశాఖపట్నం గత మూడేళ్ల నుంచి వీరిద్దరి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. పెద్దలను ఒప్పించి మరి ఈ వివాహాన్ని చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి చాలామంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.