గుడ్ నైట్ మూవీ హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..!!

ప్రస్తుతం ఓటీటి ల హవా అన్ని భాషలలో భారీగానే హవా చూపిస్తోంది.ఎక్కడ చూసినా కూడా ప్రేక్షకులు ఈజీగా చేరువయ్యే విధంగా ఓటిటిలు మంచి కంటెంట్తో ప్రేక్షకు ఆదరణ పొందుతున్నాయి. అలా తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న గుడ్ నైట్ సినిమా కూడా తెలుగులో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా హాట్ స్టార్ లో మంచి సక్సెస్ను అందుకుంది.. ముఖ్యంగా గురక కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా బాగా ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో మితా రఘునాథ్, మణికంఠన్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని వినాయక చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో వీరిద్దరూ భార్యాభర్తలు గా నటించడం జరిగింది. భర్త కోసం దేన్నైనా త్యాగం చేసే భార్యగా మితా రఘునాథ్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మేకప్ లేకుండా సహజసిద్ధమైన లుక్కులు ఆకట్టుకున్న ఈమె ఈ చిత్రంతో యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అయితే ఈమె ఎక్కువ సినిమాలలో నటించలేదు గుడ్ నైట్ చిత్రంతోనే ఈమెకు మంచి పాపులారిటీ అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యిందని తెలుస్తోంది.

తాజాగా మితా రఘునాథ్ నిశ్చితార్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తన కాబోయే భర్త ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఎంతో అందంగా ట్రెడిషనల్ చీరలో తన కాబోయే భర్త దగ్గర నిలబడిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.కానీ తన భర్త గురించి పూర్తి వివరాలు తెలియలేదు త్వరలోనే పెళ్లి పీటలు లెక్కపోతుందని అభిమానులు సైతం ఏమైందో శుభాకాంక్షలు సైతం తెలియజేస్తున్నారు. వివాహమైన తర్వాత తనని కూడా సినిమాలలో నటించమని కోరుతున్నారు.