టాప్ ఫైవ్ రేసులో డాక్టర్ బాబు.. గౌతమ్ తెలివికి షాక్ అవుతున్న ప్రశాంత్, శివాజీ..!!

ఉల్టా పుల్టా అంటూ ఆడియన్స్ ను అలరిస్తూ… సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది బిగ్ బాస్ సీజన్ 7. రసవత్తంగా సాగుతున్న ఈ షో… విచిత్రమైన టాస్కులతో.. మైండ్ గేమ్ లతో పిచ్చెక్కిస్తుంది. ఇక ప్రస్తుతం 12వ వారానికి చేరుకోగా… కెప్టెన్సీ పోటీదారుల కోసం ఓ కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి ” బిగ్ బాస్ మ్యాన్షన్ ” అనే పేరు కూడా పెట్టాడు. ఈ టాస్క్ లో ఓ కిల్లర్ హత్యలు చేస్తుండగా… పోలీసులు ఆ కిల్లర్ ను కనిపెట్టి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సూపర్ పర్ఫామెన్స్ చేసిన వాళ్ళకి క్యాప్టెన్సీ కంటైనర్లుగా అవకాశం దక్కుతుంది.

హౌస్ మెంబర్స్ కు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి.. మధ్యలో కొంతమందికి సీక్రెట్ టాస్కులు అప్పగించి మరింత రసవక్తంగా సాగిస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే శివాజీకి మిస్సెస్ బిగ్ బాస్ ను హత్య చేసే హంతకుడి రోల్ ఇచ్చి.. సీక్రెట్ టాస్క్ ను సైతం అప్పగించారు. బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి ఒకరిని హత్య చేయాల్సి ఉంటుంది. శివాజీ హత్య చేసే క్రమంలో బిగ్ బాస్ సూచించేందుకు ఓ మొబైల్ ని సైతం ఇచ్చారు. మొదటిగా ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్‌ హత్య చేశాడు శివాజీ. ప్రశాంత్ ని హత్య చేసింది శివాజీనే అని హౌస్మెట్స్ చాలామంది కనిపెట్టలేకపోయారు.

కానీ గౌతమ్ కృష్ణ మాత్రం తన తెలివితో కనిపెట్టేశాడు. డెడ్ అయిన ప్రశాంత్ దయ్యం లాగా మారిపోగా… గౌతమ్ ప్రశాంత్ తో మాట్లాడుతూ…” ఏరా ప్రశాంత్.. నిన్ను హత్య చేసింది శివాజీ అన్న నే కదా ” అంటూ వాళ్ళిద్దరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఈ విషయంపై ప్రశాంత్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ షాక్ అయ్యాడు. వీడి బ్రెయిన్ సాధారణమైనది కాదురా.. వీడు పక్కా టాప్ ఫైవ్ లో ఉంటాడంటూ ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.