ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ ఫ్రీ టికెట్స్ ఇస్తామంటున్న మేకర్స్.. ఏం చేయాలంటే..?

పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ స‌లార్. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్‌ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ రేపు డిసెంబర్ 1న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతుంది మూవీ టీం.

మరి ఈ ట్రైలర్ కి ముందుగా మేకర్స్ అలర్ట్ పోస్ట్‌ల‌ను వేస్తూ వస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ మాత్రం ఫ్యాన్స్ లో చాలా ఆసక్తిని రేపుతుంది. ఇక మేకర్స్ ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్ మరియు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన ఓ హ్యాపీ మూమెంట్ స్టీల్ షేర్ చేశారు. ఈ పిక్‌కి పర్ఫెక్ట్ క్యాప్షన్ చెప్పిన ఓ అయిదుగురికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఉచితంగా ఇస్తామంటూ కన్ఫామ్ చేశారు.

అంతేకాకుండా లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన సల్లర్ మార్చెండైజ్‌ కూడా గిఫ్ట్ గా అందించబోతున్నట్లు వివరించారు. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ వారికి తోచిన క్యాప్షన్ను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఆ ఐదుగురు అదృష్టవంతులు ఎవరో.. ఆడియోస్ లో తమ క్రియేటివ్ క్యాప్షన్లతో ఈ టికెట్లను ఎవ‌రు సొంతం చేసుకుంటారు చూడాలి.