ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్రూట్ ను అసలు తినకూడదన‌ సంగతి తెలుసా..?

బీట్రూట్ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతగాన్న సహకరిస్తుందని అందరికీ తెలుసు. అయితే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి బీట్రూట్ జ్యూస్ ఆ సమస్య నుంచి చెక్ పెట్టడానికి సహకరిస్తుంది. చర్మ సమస్యలు ఉన్నవారు కూడా బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకు చెప్పి పెట్టవచ్చు. కానీ ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా బీట్రూట్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

బీట్రూట్ ను ఎవరు అసలు తీసుకోకూడదు.. ఎందుకో.. ఇప్పుడు చూద్దాం. లో బీపీ ఉన్నవారు బీట్రూట్‌ను తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా బీట్రూట్ కి దూరంగా ఉండాలట. అలాంటి వారికి బీట్రూట్‌లు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే చంటి పిల్లలకు ఈ దుంపలతో చేసిన జ్యూస్‌ను అసలు ఇవ్వకూడదట.

పాలు ఇచ్చే తల్లులు, గర్భిణీ మహిళలు బీట్రూట్ దుంపలను తినకపోవడం మంచిదని.. అలాగే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా బీట్రూట్ ను తీసుకోకపోవడం మంచిదని తెలుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బీట్రూట్లని తీసుకోకపోవడం మంచిదట. కొంతమంది ఈ బీట్రూట్ దుంపలు తింటే ఎలర్జీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాంటి వారు కూడా బీట్రూట్ దుంపలను తినకూడదని చెప్తున్నారు. పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ ను తినడం వల్ల ఈ సమస్యలు మరింతగా పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనుక వీళ్ళు బీట్‌రూట్కి దూరంగా ఉండటమే మంచిదట.