తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలుగా, దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్న మహిళా వారసులు వీళ్లే..

టాలీవుడ్ లో మహిళా నిర్మాతలు, దర్శకులు ఒక‌ప్పుడు తక్కువ కానీ.. ఇప్పుడు అంతా మారింది. మహిళా డైరెక్టర్ కూడా పెరుగుతున్నారు. ప్రొడ్యూసర్స్ గా కూడా మహిళల ముందుకు వస్తున్నారు. మరికొన్ని నెల తర్వాత టాలీవుడ్ లో మహిళ నిర్మాతల పేర్లే ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మెల్లమెల్లగా పలు సంస్థల నుంచి మహిళా వారసులు అడుగుపెడుతున్నారు. అందరికన్నా ముందుగా వైజయంతి సంస్థ నుంచి స్వప్న దత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తనను తాను ప్రూవ్ చేసుకుంది. మంచి సినిమాలు, మంచి స్క్రిప్టులు ప్రేక్షకులకు అందిస్తుంది.

అన్నపూర్ణ సంస్థ నుంచి సుప్రియ యార్లగడ్డ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. స్టూడియో వ్యవహారాలను చూసుకుంటూనే సినిమాలు, టీవీ సీరియల్స్ బాధ్యతలు కూడా చూస్తుంది. కృష్ణ కుమార్తె మంజుల గతంలోనే నిర్మాతగా మారింది. తర్వాత పెద్ద‌గా క‌నిసించ‌లేదు. త‌ర్వాత‌ రెండో కుమార్తె పద్మావతి తన కొడుకు సినిమాలు మాత్రమే నిర్మిస్తుంది. నాగశౌర్య తల్లి ఉష కొడుకుతో పలు సినిమాలు నిర్మించింది.దిల్ రాజు సంస్థ నుంచి హన్సిక రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సినిమా అందించింది. మరికొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

పేరుకే అయినా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా ప్రొడ్యూసర్ గా మారింది. రాను రాను ఆమె కూడా స్వయంగా యాక్టివ్ అవుతుంది. మ్యాడ్ సినిమాతో ప్రొడ్యూసర్ గా ప్రముఖ నిర్మాత చిన్న బాబు కుమార్తె కూడా రంగంలోకి వచ్చింది. నిర్మాత విశ్వప్రసాద్ కుమార్తె కూడా పీపుల్స్ మీడియా బ్యానర్ లో శర్వానంద్‌తో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. సునీల్ కుమార్తె గత మూడు, నాలుగు సినిమాల నుంచి బ్యాక్ హ్యాండ్ లో ట్రైన్ అవుతుంది. ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమాతో పూర్తిగా ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టనుంది.

మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కూడా ఇప్పటికే ప్రొడ్యూసర్ గా మారింది. తండ్రితో భారీ సినిమాను చేయడానికి ప్రయత్నిస్తుంది. చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు కుమార్తె కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లో సీఈఓ గా ఉంది. నిర్మాతగా కూడా మార‌నుంది. బాలకృష్ణ కుమార్తె తేజస్విని ప్రస్తుతం తండ్రి వెనుక ఉంది. త్వరలో నిర్మాతగా మారబోతుందట. ఇలా ఒక్కో నిర్మాత నుంచి, నటి, నట్టుల కుటుంబం నుంచి మహిళలు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కొన్నేళ్ల తర్వాత తెలుగు సినిమాల్లో మహిళా నిర్మాతలే ఉండేలా టాలీవుడ్ మారిపోతుంది.