తులసి మొక్కను ఈ దిక్కులో అస్సలు పెట్టొద్దు.. ఎందుకంటే..!!

ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తులసి మొక్క కంపల్సరిగా ఉంటుంది. ఈ మొక్కకు పొద్దున్నే నిద్ర లేచి పూజలు సైతం చేస్తూ ఉంటారు. పెద్దవారికైతే ఇది ఎంతో ఇష్టమైన మొక్క అని చెప్పాలి. ఈ మొక్కని దేవుడితో కొలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మొక్క అనేక అనారోగ్య సమస్యలకు విరుగుడు కూడా. అంతేకాకుండా తులసి మొక్క ఉన్న ప్రాంతాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుతూ ఉంటారు.

అయితే తులసి మొక్కను ఏ దిశలో పెట్టకూడదు అని సందేహాలు అందరిలోను ఉంటాయి. తులసి మొక్కను శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో అస్సలు పెట్టకూడదు. ఈ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మీకు మేలు జరగడం పక్కన పెడితే.. హాని జరుగుతుంది.

అలాగే తులసి మొక్కను వంటగది దగ్గర కూడా అస్సలు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడతాయి. మీ ఇంటి దరిదాపులలో ఖాళీ స్థలం లేకపోతే తులసి మొక్కను కుండీలో పెట్టుకుని పూజించవచ్చు. అంతేకానీ ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు. ఇందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు కలుగుతాయి.