తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో లవ్ చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకొని కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ముఖ్యంగా వెంకటేష్ ఎన్నో లవ్ ఫ్యామిలీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. డైరెక్టర్ తేజ కూడా ఎప్పుడూ కూడా సరికొత్త ప్రేమ కథ చిత్రాలను తీస్తు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. అలా డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోయిన్లలో రీమాసేన్ ,అనిత వంటి వారు కూడా ఉన్నారు.
అయితే అప్పట్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లకు సైతం ఆర్తి అగర్వాల్ చాలా గట్టి దెబ్బేసిందట. ముఖ్యంగా బడా బ్యానర్ పైన స్టార్ హీరోల చిత్రాలు స్టార్ దర్శకులతో పరిచయం బాగా ఏర్పడి ఆర్తి అగర్వాల్ కి ఇండస్ట్రీ బాగా సపోర్ట్ చేసిందట. ముఖ్యంగా సురేష్ బాబు ఆయన సంస్థలోనే నువ్వు లేక నేను లేను, సోగ్గాడు తదితర చిత్రాలు విడుదలయ్యాయి. అలా స్టార్ హీరోలైన చిరంజీవి, ప్రభాస్ ,నాగార్జున, మహేష్ బాబు ,బాలకృష్ణ ,రవితేజ ఇతర అగ్ర హీరోలతో కూడా నటించింది.
దీంతో ఆర్తి అగర్వాల్ సక్సెస్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఆ సమయంలో రీమాసేన్ ,అనిత ,రీచా ఇతరత్రా హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా పోయాయట. అలా అందరినీ తొక్కుకుంటూ ఆర్తి అగర్వాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకొని మంచి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించింది..
ఇది కూడా ఈమెకు ప్లస్ పాయింట్ గా అయ్యింది. ఏమి తెలివితేటలతో సెటిల్ అయినప్పటికీ చాలా మంది హీరోయిన్స్ సైతం ఈమె వల్ల అడ్రస్ లేకుండా పోయారని సమాచారం. చిన్న వయసులోనే టాప్ హీరోయిన్గా పేరు సంపాదించిన అతి తక్కువ ఏజ్ లోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషయం ఇప్పటికీ అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటుంది.