ప్రభాస్, ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న విశ్వక్‌సేన్.. అత‌ని మూవీలో కూడా..?!

టాలీవుడ్ లో ఉండే చాలామంది స్టార్ యాక్ట‌ర్స్‌ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్‌సేన్‌ కూడా తనదైన రీతిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అందుకొని మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక బేబీ సినిమా టైంలో తను వ్యవహరించిన తీరుకు విమర్శకుల నుంచి ఆయన మీద చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అయినా తను మాత్రం సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఇక తాజాగా మంగళవారం సినిమా సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్ గా హాజరైన విశ్వక్‌సేన్ ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే కొత్త డైరెక్టర్ డైరెక్షన్లో తనదైన రీతిలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో చాలా రఫ్‌ క్యారెక్టర్లో ర‌గ‌డ్ ప‌ర్స‌న్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకీలక పాత్రలో నటించబోతున్నాడు అనే విషయం మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వరుస తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ఆదుపురుష్‌ సినిమాల్లో విలన్ రోల్ లో నటించిన సైఫ్ అలీఖాన్‌, ఎన్టీఆర్ దేవర సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వక్సేన్ సినిమాలో కూడా కీలకపాత్రలో సైఫ్ నటిస్తున్నాడని తెలియడంతో వచ్చే ఏడాది అన్ని సినిమాల్లోను విలన్ గా సైఫ్ ఆలీఖాన్ ఏ కనిపించబోతున్నాడు అంటే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో నేటిజన్స్ అంతా ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల్లో విలన్ గా ఉన్న సైఫ్ అలీ ఖాన్ త‌న మూవీలో విలన్ గా తీసుకొని విశ్వక్ కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.