‘ యానిమల్ ‘ మూవీ పిల్లలు చూసే సినిమా కాదా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!!

బాలీవుడ్‌ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ వంగ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా అర్జున్ రెడ్డి ఒకటే అయినా ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి రెండు ఇండస్ట్రీలోను మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న యానిమల్ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అదే రేంజ్ లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 1 యానిమల్ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి హైప్‌ను తెచ్చుకుంది.

సినిమాలో విపరీతమైన వైలెన్స్ ఉండడంతో ఊహించినట్లుగానే సెన్సార్ బోర్డ్ కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లలోపు పిల్లలు ఈ సినిమాను చూడడం నిషేధం. కాగా సందీప్ రెడ్డి తన సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి ఏ సర్టిఫికెట్ ప్రకారమే చిన్న పిల్లలు చూసే విధంగా ఈ సినిమా ఉండదంటూ వివరించాడు. 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ సినిమా అసలు సూట్ కాదని.. నా కొడుకు అర్జున్ అలాగే నా బ్రదర్ నా క‌జిన్స్ పిల్లలను కూడా నేను థియేటర్లో సినిమాకు తీసుకువెళ్లను.. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించడానికి ట్రై చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. నా కుటుంబంలో ఎనిమిది నెలల నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు చాలామంది ఉన్నారు అంటూ వివ‌రించాడు.

సందీప్ రెడ్డి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై స్పందించాడు. ఈ మూవీ భారీ కలెక్షన్లు వసూలు చేస్తుందా అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురుకాగా.. వసూళ్ల గురించి ఇప్పుడే నేను అంచనాలు వేయలేను.. అయితే సినిమా మాత్రం అందరిని ఆలోచింప చేసే విధంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్, బేబీ డియలో కీలక పాత్రలో నటించారు. అనిల్ కపూర్ రణబీర్ తండ్రి పాత్రలో నటించగా.. బేబి డియాలో ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించాడు. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇప్పటికే ఘనంగా జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మహేష్ బాబు, దర్శకదీరుడు రాజమౌళి హాజరయ్యారు.