చలికాలంలో పసి పిల్లలను తప్పనిసరిగా ఇలా చూసుకోవాలి…!!

శీతాకాలంలో పసి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే లేనిపోని అనారోగ్యాలు వచ్చే సమస్యలు ఉన్నాయి. పెద్దవారికి ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ.. పసిపిల్లలకి ఎక్కువగా ఉండకపోవడం కారణంగా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలకు చలికాలంలో వేడిగా ఉండేల చూసుకోవాలి.

పిల్లలను బయటకి తీసుకువెళ్లకపోవడమే మంచిది. తప్పదంటే మధ్యాహ్నం సమయంలో తీసుకెళ్లడం మంచిది. ప్రయాణ సమయంలో పిల్లలకు చలి తగలకుండా చూసుకోవాలి. చిన్నారులకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించాలి.

చర్మం పొడిబారి పోకుండా మాయిశ్చ‌రైజ‌ర్లు రాస్తూ ఉండాలి. అలాగే రోజు ఆయిల్ మసాజ్ చేయడం ముఖ్యం. తల పొడిగా మారకుండా ఆయిల్ రాయాలి. చలికాలంలో ఈ జాగ్రత్తలు మీ పిల్లలకి పాటిస్తే.. వారి దగ్గరికి ఎటువంటి అనారోగ్య సమస్య దరిచేరదు. అందువల్ల ప్రతిరోజు ఈ పనులను తప్పనిసరిగా చేయండి.