రాఖీభాయ్ తో కలిసి రాధిక రొమాంటిక్ పిక్స్… దసరా స్పెషల్ అంటూ ట్వీట్..‌!!

స్టార్ కపుల్స్ యష్, రాధిక పండిట్ విజయదశమి స్పెషల్ పోస్టుతో అభిమానులను ఆక‌ట్టుకున్నారు. ఈ మేరకు తన ఇంట్లోని దుర్గామాతకు ఘనంగా పూజలు నిర్వహించినట్లు తెలపగా.. ట్రెడిషనల్ దుస్తులు ధరించి ఇంటి బాల్కనీలో దిగిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ మురిసిపోయింది రాధిక.

” ఆనందం, ఆశీర్వాదాలతో ఈ పండగ నిండిపోవాలని కోరుతూ.. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ‌ ఇక కేజిఎఫ్‌లుక్ లోనే యష్ అట్రాక్ట్ చేయగా. బ్లూ కలర్ శారీలో రాధిక అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలను చూసిన తమ అభిమానులు జంట ఎంత చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక యష్ విషయానికొస్తే.. కేజిఎఫ్ సినిమాతో తిరుగు లేని స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. సమయం దొరికిన టైం లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులను అలరిస్తున్నాడు.