” జైలర్ ” సినిమాలో త‌న‌ పాత్ర పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివ‌న్న‌…!!

రజనీకాంత్ హీరోగా నటించిన ” జైలర్ ” సినిమాలో శివరాజ్ కుమార్ నరసింహ పాత్రలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శివ‌న్న న‌ట‌న‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ల‌భించింది. ఎంట్రీ నుంచి సినిమా కంప్లీట్ అయ్యేవరకు శివరాజ్‌కుమార్ తన నటవిశ్వ‌కూపాని చూపించారు. ఇక ఇటీవ‌ల తన పోషించిన నరసింహ క్యారెక్టర్ పై శివరాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. అప్ కమింగ్ మూవీ ” ఘౌస్ట్ ” ప్రచారంలో ఉన్న రాజ్ కుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

జైల‌ర్‌ సినిమాలో త‌న‌ పాత్రకు ఇంతటి ఆదరణ లభిస్తుందని త‌ను ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. శివ‌న్న మాట్లాడుతూ నిజంగా నా పాత్రకు వచ్చిన స్పందన చూసి నా భార్య చాలా ఆశ్చర్యపోయింది. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గారిదే. గ్రే క్యారెక్టర్లను నెల్సన్ బాగా చూపించాడు. అలా ఈ నరసింహ పాత్ర నాకు ఒక సర్ప్రైజ్ లాంటిదే.

 

ప్రేక్షకులకు ఎప్పుడు ఏది నచ్చుతుందో అంచనావేయలేము ” అన్నాడు. ఇక యాక్షన్ మూవీస్ చేయమంటే మనకు సరదాగా ఉంటుందన్న ఆయన.. నెగిటివ్ రోల్స్ లో తనలోని నటుడు సహజంగా బయటకు వస్తాడంటూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.