గోడ‌వ ప‌డిన లవ్ బర్డ్స్ శోభ, తేజ.. పుల్ల పెట్టిన్న శివాజీ..!!

బిగ్ బాస్ 7లో ఈవారం ఎలిమినేషన్స్‌ హడావిడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు మొదలయ్యాయి. ఒక రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌస్ లో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొస్తున్నాశివాజీ.. శోభ, తేజ మధ్య పుల్ల పెట్టి మంట ఎక్కువ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్ర లేవడంతో బుధవారం ఎపిసోడ్ స్టార్ట్ అయింది.

ఇక అయిపోయిన నామినేషన్ గురించి శివాజీ మాట్లాడుతూ… ” నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. కానీ ఆ టైంలో కారణాలు లేకుండా, కొందరు హీరో అయిపోతామని ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు ” అనీ సీరియల్ బ్యాచ్‌ని ఉద్దేశించి అన్నాడు. అయితే ఆ ఎగిరెగిరి పడే వాళ్లలో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంటే శివాజీ అన్న లెక్క ప్రకారం.. ప్రశాంత్ కి కూడా ఈ కామెంట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కూడా నామినేషన్ లో తప్ప మిగతా రోజులు గేమ్స్ ఆడిన సరే ఉన్నాడా లేడా అన్నట్లు ప్రవర్తిస్తాడు. కానీ నామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి తనేదో పెద్ద హీరోలా ఓవరాక్షన్ చేస్తాడు. ఇక స్ట్రాంగ్ గా ఉండే శోభ కన్నీళ్లు పెట్టుకుంది.

గత నామినేషన్ లో భోలె మెంటల్ అన్నాడని గుర్తు చేసుకుని.. మరీ తేజాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి తన ఫ్రెండ్స్ అయిన అమర్, ప్రియాంక, సందీప్ దగ్గర మాట్లాడుతూ..భోలె ఓ వేస్ట్ కంటిస్టెంట్ అని తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ముందుగా నలుగురు కెప్టెన్సీ టాస్క్ ఆడాలని బిగ్ బాస్ ఆదేశించడంతో.. అమర్, తేజ, ప్రియాంక, శోభ వెళ్లారు. ఆఖరి స్థానంలో ఉన్నవారు కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వెళ్లిపోతారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో అమర్ ఆఖరి స్థానంలో ఉండడంతో అమర్ కెప్టెన్సీ టాస్క్ కోల్పోయాడు. దీంతో బాధలో ఉండి అన్నం కూడా తిననంటూ ఏడ్చాడు.

అనంతరం రెండో రౌండ్లో రతిక కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకుంది. తేజ రతిక దగ్గరికి వెళ్లి నువ్వు కూడా అన్నం తినకుండా.. ఉండు బిగ్ బాస్ పిలుస్తాడు అని కామెడీగా చెప్పడంతో.. శోభ కి కోపం వచ్చింది. వాడేమి.. కావాలని చేయలేదు అది బాధతో చేశాడు అంటూ గట్టిగ అరిచింది. దీంతో తేజా కూడా అరుస్తూ లోపలికి వెళ్లడంతో.. శివాజీ అదే ప్రేమలు ఎక్కువైతే ఇలాగే ఉంటుంది అంటూ సూటు పోటి మాటలతో హింసించాడు. దీని ద్వారా తెలిసిందేంటంటే శివాజీ తేజను కూడా తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.