తెల్ల జుట్టును నల్లగా మార్చే ఫుడ్ ఏంటో తెలుసా..?

చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడిపోతూ ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. తెల్లబడిన వెంట్రుకలను నల్లబడడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ తినే ఆహారాన్ని మాత్రం పట్టించుకోరు. మీ తెల్ల జుట్టు నల్లబడాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. పాల ఉత్పత్తులు:
పాలు, ఛీజ్, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి 12, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు తెల్లబడకుండా కాపాడతాయి. అలాగే వీటిలోని విటమిన్ డి వెంట్రుకలను నలుపు రంగు చేయడానికి ఉపయోగపడుతుంది.

2. ఆకుపచ్చ కూరలు:
పాలకూర, క్యాబేజీ, కాలే, బ్రోక్‌లీ వంటి ఆకు పచ్చని కూరల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్స్, క్యాల్షియం నిండుగా ఉంటాయి. ఇవి కుదుళ్ళకు పోషణ అందించి వెంట్రుకలు నల్లబడేలా చేస్తాయి.

3. డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇవి తెల్ల వెంట్రుకలకు కారణమయ్యే విష పదార్థాలను బాడీ నుంచి బయటకు పంపిస్తాయి. తద్వారా జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తాయి.

4. పప్పు దినుసులు:
పప్పు దినుసుల్లో ప్రోటీన్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని విటమిన్ బి9 జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే వెంట్రుకలకు నలుపు రంగును ఇస్తుంది.

5. కోడిగుడ్డు:
కోడిగుడ్డులో విటమిన్ బి 12, బయోటిన్ వంటివి ఉంటాయి. ఇవి విటమిన్ లోపం వల్ల వెంట్రుకలు తెల్లబడడాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా కోడిగుడ్డు మంచి పోషకాలను అందిస్తుంది. తద్వారా జుట్టు నల్లబడడమే కాకుండా పెరుగుదల కూడా పుష్కలంగా ఉంటుంది.