స్టార్ట్ అయిన వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు..!

మెగా వారసుడు, నటుడు నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఎప్పుడు అయితే అధికారికంగా ప్రకటించారో అప్పటినుండి విరిగురించిన వార్తలు మీడియాలో చక్కెర్లు కొడుతూనే వున్నాయి. కాగా వీరు నవంబర్ 1వ తేదీన అనగా రేపు పెళ్లి అనే బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌ దానికి వేదిక అయింది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. నిన్న రాత్రి ఏర్పాటు చేసిన కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. దానికి సంబందించిన ఫోటోలు కూడా మీరు చూసి వుంటారు.

కాగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి హల్దీ వేడుక ఎంతో హట్టహాసంగా స్టార్ట్ అయింది. తర్వాత ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి మెహందీ పార్టీ జరుగుతుంది. చివరగా నవంబర్ 1వ తేదీన అనగా రేపు మధ్యాహ్నం 2:48కి పెళ్లి ముహూర్తం జరగనుంది. అదేవిధంగా రాత్రి 8:30 గంటలకు వివాహ రిసెప్షన్ జరగనుంది. దీనికోసం మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం, స్నేహితులు సహా దాదాపు 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నట్టు సమాచారం.

ఇకపోతే వరుణ్ లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాలలో నటించిన సంగతి అందరికీ తెలిసినదే. శ్రీను వైట్ల దర్శకత్వంలో వహించిన మిస్టర్ సినిమా ఫలితాన్ని మూటకట్టుకుందో అందరికీ తెలిసినదే. ఆ తర్వాత వచ్చిన అంతరిక్షం సినిమా అభిమానులను ఆకట్టుకున్నా.. కలెక్షన్ల పరంగా కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. కానీ మిస్టర్ సినిమా మనోళ్ళకి మంచి అనుభవాలనే మిగిల్చింది. ఆ సినిమా షూటింగ్ లోనే వీరు ఒక్కటయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. ఇపుడు చివరగా వివాహంతో ఒక్కటవుతున్నారు.