భార్య చెల్లినే పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. చివ‌ర‌కు కెరీర్ స‌ర్వ‌నాశ‌నం..!

మనం సినిమాల్లో ఎప్పుడూ ఏవో ఒక ట్విస్ట్‌లు చూస్తూనే ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో కూడా కొంతమందికి అంతకన్నా ఎక్కువ ట్విస్ట్‌లు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా సీనియర్ హీరో కార్తీక్ జీవితంలో కూడా ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. సౌత్‌లో 100పైగా సినిమాల్లో నటించిన ఆయన భార్య చెల్లెలినే రెండో వివాహం చేసుకున్నాడు. అందుకు కారణమేంటి.. తన కెరీర్ నాశ‌నంఅవ‌టానికి గ‌ల కార‌ణాలు ఎంటో ఒకసారి తెలుసుకుందాం. మురళి కార్తికేయ 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి ఆర్ ముత్తు రామన్ న‌టుడిగా మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆయన నటివారుసుడిగా కార్తీక్ అలైగళ్ ఓవతిల్లె అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. లుక్స్, నటనను చూసి డైరెక్టర్స్ అత‌నితో సినిమాలు చేయాలని ఎగబడే వారు. తక్కువ కాలంలోనే కాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సీతాకోకచిలుక సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కార్తిక అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి, హోమ్ 3d లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలైనా కార్తీక్.. మురళిగా బాగా పాపులర్ అయ్యాడు.

అభినందన సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. తమిళంలో ఏడాదికి 8 -10 సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయాడు. హీరో గానే కాక అప్పుడప్పుడు తన గొంతుకు పని చెప్తు పాటలను సైతం పాడాడు. స్టార్ హీరోగా మంచి క్రేజ్‌లో ఉన్న కార్తీక్ పై ఎప్పుడు ఏదో ఒక హీరోయిన్‌తో ఎఫైర్ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక అదే సమయంలో హీరోయిన్ రాగిణిని ప్రేమించి ఆమెని 1988లో వివాహం చేసుకున్నాడు. వారికి గౌతం కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.

అయితే రాగిణి సోదరి రతీపైన కూడా కార్తీక్ మనసు పారేసుకున్నాడని దానితో ఆమెకు గర్భం వచ్చిందని అప్పట్లో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇంతలో 1992లో రాగిణి సోదరి రతిని కూడా కార్తీక్ రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి తిర‌న్ కార్తీక్ అనే కుమారుడు పుట్టాడు. భార్య ఉండగా ఆమె చెల్లెల్ని వివాహం చేసుకున్నందుకు కార్తీక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2000 లో కార్తీక్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. హీరో కాస్త విలన్ గా మారాడు. తనకున్న చెడు వ్యసనాలు కారణంగానే తన కెరీర్ నాశనం అయిందని గతంలో స్వయంగా కార్తికే వివరించాడు.

ఇక 2006లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కార్తిక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి అతని మద్దతు ఇచ్చాడు. తర్వాత సొంతంగా పార్టిస్తాపించాడు అఖిల ఇండియా నాదళమ్‌ మక్కల్‌ కచ్చి అనే పేరు పెట్టి పార్టీని రన్ చేసాడు. లోక్‌శ‌భ ఎన్నికల్లో పోటీ చేసిన కార్తీక్ చిత్తుగా ఓడిపోయాడు కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అతను 2018 లో మనిత ఊరమైగ‌ళ్ క‌క్క‌మ్‌ అనే మరో పార్టీని స్థాపించి ఏఊఏడియ‌మ్‌కే కూటమికి తన మద్దతును అందించాడు. తను చేసిన తప్పిదాల వల్లే కార్తీక్ కెరీర్ నాశనం అయిందని ఇప్పటికి తమిళ్ ప్రజలు భావిస్తూ ఉంటారు.