” రష్మిక మీరు ఇంకా టచ్ లో ఉన్నారా ” రక్షిత శెట్టి కామెంట్స్ వైరల్..!

777 చార్లీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను దక్కించుకున్నాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఈ సినిమాతో టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రక్షిత్ ఇటీవల నటించిన సప్తసాగర దాచే ఎల్లో కూడా సూపర్ హిట్గా నిలిచింది. మాస్, కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి కంటెంట్ పై దృష్టి సారించారు రక్షిత్ శెట్టి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రక్షిత్ శెట్టి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తాజాగా ఆయన నటించిన సప్త సాగర దాచే ఎల్లో సినిమాని తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు.

ప్రస్తుతం తెలుగులో సప్త సాగర దాచే ఎలో సినిమాని విడుదల చేస్తూ ఆ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు రక్షిత్ శెట్టి. దీన్ని తెలుగులో సప్తసాగరాలు దాటి అనే పేరుతో రిలీజ్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కొద్ది రోజులుగా రక్షిత్ శెట్టి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రష్మిక కు సంబంధించిన ఓ ప్రశ్న రక్షిత్ శెట్టి కి ఎదురయింది. వన్ అండ్ వన్ ఇంటర్వ్యూలో రేష్మికకి సంబంధించిన యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు రక్షిత్ శెట్టి చాలా ప్రశాంతంగా, గౌరవంగా సమాధానం ఇచ్చాడు.

రష్మిక తో రక్షిత్ శెట్టి ఇంకా టచ్ లో ఉన్నాడా.. అని యూట్యూబర్‌ అడగగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ అవును మేమిద్దరం టచ్ లోనే ఉన్నాము ఆమె ఎప్పుడు పెద్ద క‌ల‌లు కంటువుండేది ఇప్పుడు ఆమె ఆ కలలన్నీ నిజం చేసుకుంటుంది ఆమె విజయాన్ని ప్రశ్నించాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక‌ సప్తసాగర దాచే ఎల్లో సినిమాని హేమంతరావు దర్శకత్వం వహించాడు. రక్షిత్ శెట్టి స్వయం ప్రొడక్షన్లో అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాల్లో రుక్మిణి వసంత హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొటేసింది. ఇప్పటికే మొదటి పార్ట్ ను విడుదల చేసిన మూవీ టీం రెండో భాగంలో అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తారు.