పైన ఫోటోలో స్టైలిష్ గా కనిపిస్తున్న క్యూటీ ఎవరో గుర్తు పట్టారా..? టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసింది. రెండో సినిమాకు స్టార్ అయిపోయింది. తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ లోనూ యాక్ట్ చేసి.. స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికైనా గెస్ చేశారా ఆమె ఎవరో..? ఇలియానా అండీ బాబు. ఆమె చైల్డ్ హుడ్ పిక్ అది.
ముంబైలో జన్మించిన ఇలియానా.. దేవదాసు మూవీతో 2006లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మహేష్ బాబుకు జోడీగా `పోకిరి` సినిమాలో నటించి.. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకుంది. పోకిరి హిట్ తో తెలుగుతో, తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్ కు మాకాం మార్చిన ఈ గోవా బ్యూటీ.. అక్కడ చక్రం తిప్పాలని ఆశ పడింది. కానీ, అది జరగలేదు.
ఇంతలోనే ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో పడి కెరీర్ ను గాలికి వదిలేంది. ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశాక బ్రేకప్ చెప్పుకొచ్చారు. దీంతో డిప్రెషన్ కు లోనై బరువు పెరిగింది. ఆ తర్వాత బరువు తగ్గినా.. ఇలియానాకు ఆఫర్లు రాలేదు. ఇక ఇదే తరుణంలో తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి పెను సంచలనం రేపింది. ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చింది. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు కూడా పెట్టేసింది.
అయితే ఇలియానా ఇప్పటి వరకు తన భర్తను పరిచయం చేయలేదు. దీంతో ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిందని భావించారు. ఇదే తరుణంలో ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇలియాన భర్త పేరు మైఖేల్ డోలన్ అని.. గత ఏడాది నుండి వీరు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, 2023 మే నెలలో వీరి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ, ఇలియానా మాత్రం ఈ విషయంపై నోరు విప్పకపోవడం గమనార్హం.
View this post on Instagram