బ్లాక్‌డ్రెస్‌లో బ్యూటిఫుల్‌గా వెలిగిపోతున్న గీతామాధురి.. అభిమానులు ఫిదా..!

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఎస్‌బీఐ ఉద్యోగి ప్రభాకర్ శాస్త్రికి జన్మించింది గీతామాధురి. చిన్నతనంలోనే వీరి ఫ్యామిలీ హైదరాబాద్ కి మాకాం మార్చింది. అక్కడే గీతామాధురి తన స్కూలింగ్ అంతా పూర్తి చేసింది. చదువుతోపాటు మ్యూజిక్ కూడా నేర్చుకుంది. 2007లో వచ్చిన చిరుత సినిమాలో “చమ్కా చమ్కా చంకీరే చిన్నారి చింగారే మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే” పాట పాడే ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. ఈ పాటకు బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా సిని’మా’ అవార్డ్స్ కూడా దక్కించుకుంది. నచ్చావులే మూవీలో ‘నిన్నే నిన్నే చూసా’ పాట అద్భుతంగా పాడి మరోసారి ప్రేక్షకుల మనసులతో చేసింది. ఈ పాటకు బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌గా నంది అవార్డు గెలుచుకుంది.

మగాళ్లు వట్టి మాయగాళ్లు, టాపు లేచిపోయిద్ది, డార్లింగే, పక్కా లోకల్, జై బాలయ్య వంటి సాంగ్స్ కూడా అదిరిపోయేలా పాడి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ సింగర్‌ కొంతకాలంగా సింగింగ్ కాంపిటీషన్స్‌లో వివిధ పాత్రలలో కనిపిస్తూ అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్‌ అందిస్తోంది. లేటెస్ట్ ఫోటోషూట్స్ కూడా పంచుకుంటూ అందర్నీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ స్పెషల్ కస్టమైజ్డ్ డిజైనర్ వేర్ బట్టల దుకాణాన్ని ప్రమోట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఒక మంచి డ్రెస్ లో మెరిసింది.

గీతా మాధురి ఔట్-అండ్-ఔట్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో చాలా ముద్దుగా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ డార్క్ కలర్ డ్రెస్‌లో వెలిగిపోతూ అందరి చూపులు తన వైపే తిప్పుకుంది. రైట్ హ్యాండ్‌పై బ్లాక్ కలర్ బటర్‌ఫ్లై మార్క్, మణికట్టుకు బ్లాక్ కలర్ వాచ్, నుదుటున నీటి బిందువు లాంటి బ్లాక్ కలర్ బొట్టు బిళ్ల ఆమెను మరింత అందంగా మార్చాయి. ఇయర్ రింగ్స్ ఆమె చెవులకు అందం తీసుకొచ్చాయి. ఈ ముద్దుగుమ్మ పెదాలపై చిరునవ్వు విలువైన ఆభరణంగా మారింది. ఈ అమ్మడు క్యూట్ పోజులు మాత్రమే కాకుండా హాట్ పోజులు కూడా ఇచ్చింది. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి చాలా క్యూట్ గా ఉన్నావ్ అంటూ ఫ్యాన్స్ ఆమెపై ప్రేమ కురిపిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)