మెగా హీరోతో కలర్స్ స్వాతి కాలేజ్ డేస్ నుంచేనా.. బయటపడిన గుట్టు…‌!

మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ” సాల్ ఆఫ్ సత్య ” అనే షార్ట్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైనికుల భార్యల త్యాగాలను, వారి మను విధానాన్ని తెలియజేసేలా నవీన్ కృష్ణ ఈ ఫిల్మ్ ను తెరకెక్కించాడు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే ( ఆగస్ట్ 15 ) సందర్భంగా ” సత్య ” అనే పేరుతో హృదయాలను దోచుకునే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ అత్యంత భావోద్వేగ భరితంగా… సైనికుల భార్యల మనో వేదనకు అద్దం పట్టేలా ఉండడంతో ఈ పాట ప్రేక్షకులందరిని కంటతడి పెట్టించింది. ఇందులో తేజ్ ఒక సైనికుడిగా కనిపిస్తాడు.

స్వాతి తేజ్ భార్యగా నటించింది. ఇదంతా పక్కన పెడితే ” మంత్ ఆఫ్ మధు ” అని సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలను మంగళవారం ( సెప్టెంబర్ 26 ) విడుదల చేశారు. దీనికి గెస్ట్ గా వచ్చిన తేజ్ స్వాతి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ” స్వాతి మీ అందరికీ కలర్స్ స్వాతి. కానీ నాకు మాత్రం స్వాతిగాడు. ఎందుకంటే కాలేజీ రోజుల నుంచే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్.. కలర్స్ స్వాతి గా మొదలై స్వాతి అయ్యింది. ఆ తరువాత స్వాతిగాడు అయ్యింది.

ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్వాతి ” అని తేజ్ చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే స్వాతి తేజ్ను హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. ఇక స్వాతి మాట్లాడుతూ…” మేం ఇద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లోకి నేను ముందే వచ్చేసాను. అలా అని తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటారేమో. కానీ మా ఇద్దరిది ఒకే వయసు. ఒకే కాలేజీలో డిగ్రీ చదువుకున్నాం. ఎగ్జామ్స్ లో నేను చూపిస్తేనే పాసయ్యాడు. ఏడాదిగా కలిసి ” సత్య ” అని ప్రాజెక్ట్ చేశాం. తేజ్ నా లైఫ్ లో ఎప్పుడూ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజ్ ” అంటూ స్వాతి, సాయిధర‌మ్‌ తేజ్ తో ఉన్న బాండింగ్ గురించి వెల్లడించింది.