న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారం తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా తినుబండారాలను న్యూస్ పేపర్ లో చుట్టిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా బజ్జీలు, పునుగులు, వడలు ఇతర వాటిని ఎక్కువగా ఇష్టపడి తినేవారు చాలామంది ఉన్నారు.. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ రుచి మరి ఎక్కడ దొరకదని చెప్పవచ్చు. సాధారణంగా రోడ్డు పక్కన , ఏదైనా బండిమీద స్నాక్స్ కానీ ఇతర ఆహారాలను ఎక్కువగా న్యూస్ పేపర్లలో ఇస్తూ ఉంటారు అయితే ప్యాకింగ్ చేసిన న్యూస్ పేపర్లో చేసి ఇస్తూ ఉంటారు. వేడిగా ఉన్న బజ్జీలు పునుగులు వడలు ఇతరస్త్ర వాటిని వేడిగా ఉన్నప్పుడు పేపర్లో ప్యాక్ చేసి ఇచ్చినవి తింటే చాలా ప్రమాదమట.

ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ స్టాండ్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం తెలియజేయడం జరిగింది.. ఇళ్లల్లో చాలామంది మహిళలు స్నాక్స్ తయారు చేసే సమయంలో నూనెలో బాగా వేయించిన తర్వాత తీసి వాటిని నూనె పీల్చుకోవడానికి ఏదైనా పేపర్లో వేస్తూ ఉంటారు ఇది చేయడం కూడా చాలా ప్రమాదమేనట. వేడివేడి ఆహారాలు కానీ చల్లారిన ఆహారాలు కానీ న్యూస్ పేపర్ లో వేసిననా ప్యాకింగ్ చేసినవి తిన్న చాలా ప్రమాదమే అంటూ తెలుపుతున్నారు FSSAI అధికారులు.

న్యూస్ పేపర్ లో ప్యాకింగ్ చేసిన వాటిని తింటే అనారోగ్యానికి గురవుతారట. వార్త పత్రికలలో ఆహార పదార్థాలను ఉంచడం భద్రపరచడం కూడా మంచిది కాదట..ఎందుకంటే పేపర్లలో వాడే ప్రింటింగ్ ఇంక్ చాలా హానికరమైన రసాయనాలు అందులో ఉంటాయట. వీటి వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని తెలుపుతున్నారు. ఎక్కువమంది ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేసేందుకు న్యూస్ పేపర్లను వాడుతున్నారు.. ఇలాంటి వాటన్నిటిని నిలిపివేయాలంటే FSSAI అధికారులు ఆదేశిస్తున్నారు. న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఉపయోగించే ఇంకు శరీరంలోకి ఆహార పదార్థాలతో కలిసి వెళ్తే చాలా ప్రమాదమట. ఈ ఇంకులో సీసం, హెవీ మెటల్స్ తో పాటు పలు రకాల కెమికల్స్ కూడా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.