బిగ్‌బాస్ హౌజ్‌లోకి టిక్‌టాక్ స్టార్.. క్లారిటీ ఇచ్చిన దుర్గారావు

బిగ్ బాస్ 6 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మరో సీజన్ కు బిగ్ బాస్ రెడీ అవుతుంది. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రోమోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున చేయనున్నారు. ఇప్పటికే ఈ సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్ కొంచెం కొత్తగా కూడా ప్లాన్ చేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు గత కొన్నిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేది వీళ్ళే అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. సరికొత్త రూల్స్, గేమ్స్ తో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈసారి హౌస్ లోకి ఎవరు వస్తారు అనేది ఇంకా తెలియలేదు. ఇప్పటికే చాలా మందిని సంప్రదించగా కొందరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా వైష్ణవి చైతన్య కూడా వస్తుంది అని టాక్ నడిచింది. అయితే బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వైష్ణవి వచ్చే ఛాన్స్ లేదు.

ఇక ఈసారి బిగ్ బాస్ లోకి టిక్ టాక్ స్టార్ ఎంట్రీ ఇస్తారనే వార్త వైరల్ అవుతుంది. ఆయన ఎవరో కాదు. తక్కువ టైంలోనే ఫేమస్ అయిన దుర్గారావు. దుర్గారావు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టిక్ టాక్ లో తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలతో దుర్గారావు ఫేమస్ అయ్యారు. టీవిలో కూడా కనిపించడమే కాకుండా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో ఒకసారి కనిపించి వెళ్లారు. ఆ తరువాత దుర్గారావు మరింత పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు దుర్గారావు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే గత సీజన్ లోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చినా అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి.

కానీ ఈ ఏడాది మాత్రం పక్కాగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. తాజాగా దుర్గారావు మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిందని, బిగ్ బాస్ 7లో తనను ఎంపిక చేసామని వారు చెప్పినట్లు తెలిపాడు. కానీ తనను ఒక్కడినే రమ్మన్నారని కేవలం ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అని చెప్పారని దానికి తాను ఒప్పుకోలేదని అతడు వివరించాడు. తనకి ఇంత సపోర్ట్ చేసిన భార్యకి కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరినట్టు తెలిపాడు. మరి దీనికి బిగ్ బాస్ ఏం చేయనున్నారో చూడాలి. ఒక్కరికి ఛాన్స్ ఇస్తారా..లేకుంటే తాను కోరినట్టు ఇద్దరికీ ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఈ విషయాలపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.