ఆ చిన్న కారణంతో నాగార్జున మన్మధుడు సినిమాను చేతులారా వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

అక్కినేని అందగాడు నాగార్జున నటించిన ఆల్ టైమ్ సూపర్ హిట్ క్లాసికల్ సినిమాలలో మన్మధుడు కూడా ఒకటి.. సీనియర్ దర్శకుడు విజయ భాస్కర్ తెర‌కెక్కించిన‌ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు తన అదిరిపోయే మాటలతో డైలాగులతో మరో లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ఎంతో హైలెట్ గా ఉంటుంది. అలాగే దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది.

2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మధుడు సినిమా నాగార్జున పుట్టినరోజు అనగా ఈరోజు ఆగస్టు 29న మరోసారి ప్రేక్షకుల‌ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మన్మధుడు రీరిలీజ్ పై నాగార్జున అభిమానులు, నెటిజ‌న్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కూడా ఎంతో హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాగార్జున ప్రియురాలుగా అన్షు ఎంతో అద్భుతంగా నటించింది. స్క్రీన్‌పై ఆమె కనిపించేది కొద్దిసేపు అయినా తనదైన క్యూట్ నటనతో కట్టిపడేసింది. అయితే ఈ సినిమాలో అన్షు పాత్రను ముందుగా మరో స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌తో నటింపచేయాలని మేకర్స్ భావించారట.

విజయ్ భాస్కర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతోనే ఆర్తి ఇండస్ట్రీకి పరిచయమైంది. దాంతో మన్మధుడు సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ రోల్ కోసం మరోసారి ఆమె దగ్గరకు వెళ్లారట చిత్ర యూనిట్. అయితే సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండటం దానికి తోడు కార్ ఆక్సిడెంట్ లో తన పాత్ర చనిపోవడంతో ఆర్తి అగర్వాల్ ఆ క్యారెక్టర్ కు నో చెప్పిందట. మీరు అంతగా కావాలంటే సోనాలి క్యారెక్టర్ అయితే చేస్తానని చెప్పేసిందట. ఇక దాంతో మరో హీరోయిన్ అన్షు కు దర్శకుడు విజయభాస్కర్ అవకాశం ఇచ్చారట.

ఈ విధంగా ఆర్తి అగర్వాల్ తన కెరీర్ లోనే ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుంది. ఇక మరో హీరోయిన్ అన్షు కెరీర్ కు మన్మధుడు సినిమా ఎంతో హెల్ప్ అయింది. అయితే ఆమె ఎక్కువ కాలం సినిమాల్లో తన కెరీర్ కొనసాగించలేకపోయింది. కాగా మన్మధుడు సినిమాను మిస్ చేసుకున్నప్పటికీ అక్కినేని నాగార్జునతో నేను న్నాను సినిమాలో ఆర్తి అగర్వాల్ నటించింది.