నాకు అది లేద‌నే స్టార్ హీరో సినిమా నుంచి తీసేశారు..కుర్ర హీరోయిన్ సెన్షేష‌న‌ల్‌..!

తమిళ నటి ఇవానా ఈమె లవ్ టుడే సినిమా హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై. ‘ మాస్టర్ ‘ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఇవాన మలయాళంతో పాటు తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్గా నటించింది. తమిళ్ ‘ లవ్ టుడే ‘ సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈమె తెలుగులో ఈ సినిమాకు డబ్బింగ్‌గా వచ్చిన ‘ లవ్ టుడే ‘ తో కూడా సక్సెస్ సాధించింది. కేవలం రూ5. కోట్ల ఖర్చుతో ఈ సినిమాను రూపొందిస్తే ఒక తమిళ్లోనే సినిమా దాదాపు రూ.60 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఇవానకు కూడా సినిమా సక్సెస్ తో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న ఇవాన‌ ఇటీవల ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ప్రస్తుత ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తను ఎత్తు తక్కువగా ఉండడం వల్ల అనేక అవకాశాలు కోల్పోయానని.. కన్నడ పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోతో సినిమా అవకాశం వచ్చిందని.. పూజా కార్యక్రమాలు కూడా జరిగిన తరువాత హీరో పక్కన ఎత్తు సరిపోలేదనే ఆఖరి నిమిషంలో నన్ను రిజెక్ట్ చేశారంటూ ఆ టైంలో నేను ఎంతో బాధపడ్డానని వివరించింది ఇవానా.

ఇక్కడే కాదు లవ్ టు డే సినిమా టైంలో కూడా బాడీ షేవింగ్ అవమానాలు నేను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. చాలామంది ఫిజికల్ స్ట్రక్చర్ గురించి ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు.. నా చిన్నప్పుడు కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను స్కూల్ అసెంబ్లీ టైం లో కూడా నన్ను ముందు నుంచో పెట్టేవారు.. కేవలం దానికి కారణం నేను పొట్టిగా ఉండటమే. స్కూల్లో చదివేటప్పుడు నా స్నేహితులు కూడా నన్ను ఎగతాళిగా మాట్లాడేవారు ఆ ప్రభావం నాకు రోజంతా ఉండేది అని చెప్పుకొచ్చింది. ఇలా తన ఎత్తు కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొందట ఇవాన‌.

ఇక మహేంద్రసింగ్ ధోని ప్రొడక్షన్స్ సంస్థల్లో వచ్చిన మొదటి సినిమా ఎల్‌జీఎంలో ఇవాన‌ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఇవాన‌ 20 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ 7/జి ‘ బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందట. ‘ 7/జి ‘ బృందావన్ కాలనీ హీరో రవికృష్ణ ఈ సినిమాతో మళ్ళీ హీరోగా రియంట్రి ఇవ్వబోతున్నాడట. సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అన్ని అనుకున్నట్లు జరిగితే ఇవాన హీరోయిన్గా కనిపిస్తుంది.