సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించిన మూవీ జైలర్. ఇటీవల ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జైలర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్ల భారీ వసూళ్లు కొల్లగొట్టింది. జైలర్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ రేంజ్‌లో కలెక్షన్లను సాధించింది.
జైలర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 4 రోజుల్లో రూ.32 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా లాంగ్ రన్‌లో మరింత భారీగా వసూళ్లను కొల్లగొడుతుంది అనడంలో సందేహం లేదు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా కి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ తధితరులు కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది.