`స్పై`.. రీసెంట్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీలక పాత్రలను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు.
జూన్ 29వ తేదీన భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయింది. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. అయితే టాక్ ఎలా ఉన్నా తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టింది. రెండో రోజుకు నెగటివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వడంతో.. కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి.
స్పై మూవీకి వరల్డ్ వైడ్ గా రూ. 17.50 కోట్లు రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 18.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ.6.69 కోట్ల షేర్, రూ. 10.75 కోట్లు గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 9.29 కోట్ల షేర్, రూ. 16.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా రూ.9.21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్ ను నిఖిల్ రీచ్ అవుతాడో లేదో చూడాలి. కాగా, ఏరియాల వారీగా `స్పై` 3 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజాం: 3.04 కోట్లు
సీడెడ్: 93 లక్షలు
ఉత్తరాంధ్ర: 78 లక్షలు
తూర్పు: 47 లక్షలు
పశ్చిమ: 30 లక్షలు
గుంటూరు: 58 లక్షలు
కృష్ణ: 35 లక్షలు
నెల్లూరు: 24 లక్షలు
——————————————–
ఏపీ + తెలంగాణ మొత్తం= 6.69 కోట్లు(10.75 కోట్లు~ గ్రాస్)
——————————————–
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 1.00 కోట్లు
ఓవర్సీస్: 1.60 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్= 9.29 కోట్లు(16.50 కోట్లు~ గ్రాస్)
——————————————–