కథ నచ్చి మంచి క్యారెక్టర్ ఉంటె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు హీరోయిన్లు. వారి పాత్ర తక్కువ ఉన్నా సరే కథ బాగుంటే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ఇలా కథ నచ్చిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోయిన్ లలో నయనతార ముందుంటున్నారు. నయనతార కాకుండా తాజాగా సమంత కూడా లేడీ ఓరియంటెడ్ సినిమా చేసి అదరగొట్టింది. నయనతార గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నయనతార హీరోయిన్ గా చేస్తూనే లేడీ ఓరియంటెడ్ చేస్తుంటుంది.
దర్శకులు కథ చెప్పిన వెంటనే కథ బాగుంటే హీరోయిన్ పాత్ర అయినా, చిన్న రోల్ చేయడానికైనా నయనతార ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేస్తుందంట. ఇప్పటికే ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. నయనతార వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే. నయనతార ట్విన్స్ కు జన్మనించింది. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది. అయితే ఇప్పుడు నయనతార మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట.
ఈ సినిమాతో విక్కీ డ్యూడ్ అనే ఓ యూ ట్యూబర్ దర్శకుడిగా పరిచయం కానున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ ను జులై నెలలోనే మొదలుపెట్టనున్నారు అని టాక్. అయితే ఈ సినిమా కాకుండా నయనతార మరో నాలుగు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి నటిస్తున్న జవాన్ సినిమా కూడా ఉంది. ఈ సినిమా ఈ సంవత్సరంలోనే థియేటర్ లలో విడుదల కానుంది. ఇప్పటికే జవాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. షారుక్ ఖాన్ పఠాన్ సినిమా తరువాత ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పదుకొనె కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.