వేల కోట్లకు వార‌సురాలు.. కానీ, రూ. 400ల‌కు క‌క్కుర్తిప‌డి సారా అలీ ఖాన్ అలాంటి ప‌ని చేసిందా?

సారా అలీ ఖాన్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, ఆయ‌న మొద‌టి భార్య అమృతా సింగ్ ల‌కు సారా.. 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన `కేదార్‌నాథ్` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకోవ‌డ‌మే కాదు.. న‌టిగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

అన‌తి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో దూసుకుపోతోంది. `జరా హట్కే జరా బచ్‌కే` అనే మూవీతో తాజాగా సారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇందులో విక్కీ కౌశ‌ల్ హీరోగా న‌టించారు. నేడు విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక‌పోతే వేల కోట్ల‌కు వార‌సురాలు అయిన సారా అలీ ఖానా.. డ‌బ్బు విష‌యంలో చాలా పొదుపుగా ఉంటుంది. ఎంత‌లా అంటే రూ. 400ల‌కు కూడా క‌క్కుర్తిప‌డేంత‌. అస‌లేం జ‌రిగిందంటే.. ఇటీవల‌ ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌ కోసం సారా విదేశాలకు వెళ్లింది.

అయితే అక్కడ రోమింగ్ కోసం రూ. 400 చెల్లించాలని హోటల్ మేనేజ్మెంట్ వాళ్లు అడిగారట. దీంతో ఆమె ఒక్కరోజు రోమింగ్ కోసం అంత చెల్లించాలా.. అని తన మేకప్ మ్యాన్ ను హాట్ స్పాట్ ఆన్ చేయాలని కోరిందట. ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సారా స్వ‌యంగా వెల్ల‌డించింది. దాంతో రూ. 400 ఖ‌ర్చు పెట్ట‌డానికి సారా క‌క్కుర్తి ప‌డిందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే సారా వెర్ష‌న్ మ‌రోలా ఉంది. తన దృష్టిలో డబ్బును పొదుపు చేస్తే రెట్టింపు సంపాదించినట్లే అని సారా భావిస్తుంద‌ట‌. అందుతే తాను డ‌బ్బు విష‌యంలో చాలా పొదుపుగా ఉంటాన‌ని చెబుతుంది.