టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తరువాత తమన్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. అప్పటివరకు ఫామ్ లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ కు పోటీ ఇవ్వడమే కాకుండా ఒకానొక సమయంలో దేవిశ్రీప్రసాద్ ని మించిపోయేలా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తమన్‌ను ఒక సమస్య వెంటాడుతుంది. వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటికి ఓకే చెప్పడంతో సరైన సమయానికి ఆల్బమ్స్ ని అందించలేకపోతున్నాడు. అంతేకాకుండా తాను ఇచ్చిన ట్యూన్ ని తనే కాపీ కొడుతున్నాడని, లేదంటే తమిళ సినిమాలో పాటలను, బీజీఎమ్ని కాపీ కొడుతున్నాడు అంటూ తమన్ పై ఎప్పటినుండో ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా టైటిల్స్ తో పాటు, ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకి తమన్ ఇచ్చిన బీజీఎమ్ కాపీ అని చాలామంది అతని ట్రోల్ చేస్తున్నారు. దాంతో తమన్ ని ఈ ప్రాజెక్టు నుండి బయటికి పంపేసి, అనిరుధ్ ని తీసుకున్నారని సమాచారం. తమన్ కాపీ కొట్టిన ట్యూన్ అచ్చం విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ట్యూన్ లానే ఉందట. అయితే అనిరుధ్ ట్యూన్ ని తమను కాపీ కొట్టాడని సమాచారం మాత్రం అధికారికంగా రాలేదు. మరి ఈ విషయంపై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇదిలా ఉండగా తమన్ ని గుంటూరు కారం సినిమా నుండి తొలగించిన విషయంలో ఎవరికి తోచిన రీజన్స్ వారు చెప్తున్నారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా వస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కి,తమన్ కి పడటం లేదట. అందుకే సినిమా నుండి తమన్ ని తొలగించినట్లు ప్రచారం జరుగుతుంది. తమన్ ని తొలగించారు బానే ఉంది కానీ ఆ ప్లేస్ లో ఎవరు సంగీతం అందిస్తారనేది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఇప్పటికే అనిరుధ్ రవిచంద్రన్, జీవి ప్రకాష్ కుమార్ లలో ఒక్కరికి ఛాన్స్ ఇవ్వొచ్చని సమాచారం. అయితే వారిద్దరిలో చాలామంది అనిరుధ్ కే ఓటు వేసారు. ఈ విషయాలన్నీటిపై తమన్ గట్టిగా రిప్లై ఇచ్చాడు.’ నాపై కడుపు మంట ఉన్నవాళ్లే ఇలా మహేష్ బాబుకి నాకు పడటం లేదని ప్రచారం చేస్తున్నారు’ అంటూ ఫైర్ అయ్యాడు. అసలు ఇంతకీ గుంటూరు కారం సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.