Puspa-2: పుష్ప -2 నుంచి యాక్షన్ సీన్ లిక్.. వీడియో వైరల్..!

అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు వచ్చేలా చేసిన చిత్రం పుష్ప.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో పడ్డారు చిత్ర బృందం. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. పుష్ప సినిమా మించి పుష్ప -2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక గ్లింప్స్ ను విడుదల చేయడం జరిగింది దీంతో ఆ వీడియో మంచి పాపులారిటీ సంపాదించింది.

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ మేనరిజం డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా సౌత్ కంటే నార్త్ ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి యాక్షన్ సీన్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది. అందులో ఎర్రచందనం లోడుతో నాలుగు లారీలు నదిలో వెళుతూ ఉండగా పోలీసులు వాటిని చేంజ్ చేస్తూ వెళుతున్నారు.అయితే ఇది అవుట్ డోర్ షూటింగ్ కావడం వల్ల కొంతమంది అభిమానులు ఆ విజువల్స్ ని మొబైల్స్ లో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప చిత్రంలో అనసూయ, సునీల్ ఫహద్ ఫాజిల్ కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరొక కీలకమైన పాత్రలో జగపతిబాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది.