మెగా హీరో వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి గత కొన్నిల్లుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపించాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరికి నిశ్చితార్థం జరగబోతోంది అంటూ పలు రకాల వార్తలు వినిపించాయి.అయితే ఎట్టకేలకు ఆ వార్తలు నిజము చేస్తూ నిన్నటి రోజున నాగబాబు ఇంట్లో ఘనంగా నిశ్చితార్థ కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంబ సభ్యులతోపాటు అల్లు అర్జున్ , చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు పలువురు సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది.
వీరి నిశ్చితార్థానికి సంబంధించిన పలు ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.. వరుణ్ లావణ్య లవ్ దొరికింది అంటూ ఈ లవ్ బర్డ్స్ షేర్ చేసిన ఫోటోలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. కాబోయే పెళ్లికూతురు లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేసి..2016 నుంచి తమ ఇద్దరి ప్రేమ ఉన్నట్లు తెలిపింది. దీంతో పలువురు అభిమానులు నేటిజెన్లు వీరికి శుభాకాంక్షలు సైతం తెలియజేస్తున్నారు.
చూడడానికి చాలా చూడముచ్చటైన జంటగా క్యూట్ జోడిగా ఉందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో లావణ్య, వరుణ్ తేజ్ కేవలం రెండు సినిమాలలో మాత్రమే నటించారు.. వరుణ్ తేజ్ ముందుగా ముకుంద సినిమాతో తన సినీ చర్యలను మొదలుపెట్టారు. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటించింది. రాజాగా వీరికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram