ఆ సినిమా పాత్ర కోసం తీవ్రంగా గాయపడిన అదా శర్మ.. షాకింగ్ పిక్స్ వైరల్..

ప్రముఖ నటి అదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఈమె నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో ఈ అమ్మడు పేరు బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మే 5 న విడుదల అయిన ఈ సినిమా దాదాపు రూ. 230 కోట్లు వసూలు చేసింది. మరికొద్ది రోజుల్లో రూ.250 కోట్లు కలెక్ట్ చేస్తుందని సమాచారం.

లవ్ జిహాద్ ఇత్తివృతంతో తెరకేక్కిన ఈ సినిమా అదా శర్మ ‘ షాలిని ఉన్ని కృష్ణన్ అలియాస్ ఫాతిమా ‘ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ది కేరళ స్టోరీ సినిమాలో అదాశర్మ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ది కేరళ స్టోరీ ‘ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ సక్సెస్ అంత తేలిగ్గా రాలేదని చెప్తుంది అదా శర్మ. ది కేరళ స్టోరీ సినిమా కోసం తను ఎంత కష్టపడిందో తెలియజేయడానికి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

ఆ ఫోటోలలో అదా శర్మ ముఖం నిండా గాయాలతో గుర్తుపట్టలేని విధంగాకనపడుతుంది. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన మూవీ టీమ్ మైనస్ 16 డిగ్రీల ఉష్ణోగ్రత లో సుమారు 40 గంటల ఉన్నారట. డిహైడ్రేషన్ కారణంగా ఆదాశర్మ పెదాలు మొత్తం పగిలిపోయాయట. సినిమాలోని ఒక సీన్లో భాగంగా అదా శర్మ కింద పడె సీన్ ఉంది. తను కిందపడే సమయానికి పరుపు వేద్దాం అనుకున్నారు కానీ అలా జరగలేదు దాంతో అదా శర్మ మొఖం మొత్తం దెబ్బలు తగిలాయి. ఏదైతేనేం ప్రస్తుతం అదా శర్మ పడిన కష్టానికి మంచి ప్రతిఫలమే దక్కింది. ప్రస్తుతం అదా శర్మ షేర్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు అదా శర్మ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.