ఒక్క ట్వీట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరకాటంలో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేడు తెలుగులో రెండు సినిమాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. అందులో నరేష్-పవిత్ర నటించిన `మళ్లీ పెళ్లి` ఒకటి కాగా.. మరొకటి `మేమ్ ఫేమస్`. సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ రచనాదర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఇందులో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు.
అయితే విడుదలకు ముందే `మేమ్ ఫేమస్`కు చిత్రానికి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. `మేమ్ ఫేమస్ చిత్రాన్ని ఇప్పుడే చూశాను… బ్రిలియంట్ గా ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు రచయిత, దర్శకుడు, హీరో అయిన సుమంత్ ప్రభాస్ సో టాలెంటెడ్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నీ బాగా కుదిరాయి` అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. దీంతో ఈ చిన్న చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ ట్వీట్ కారణంగా మహేష్ అడ్డంగా బుక్కైయ్యారు. ఒక చిన్న సినిమాను మహేష్ చూడటం.. పైగా పనిగట్టుకుని మరీ రివ్యూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదొక ప్రమోషన్స్ స్ట్రాటజీ అని.. అసలు మహేష్ ఈ సినిమాను చూసి ఉండడని, పబ్లిసిటీ కోసమే మహేష్ బాబు ఈ ట్వీట్ చేయించుంటారని ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే మేమ్ ఫేమస్ రివ్యూ ఇచ్చావు కదా.. ఇప్పుడు `మళ్లీ పెళ్లి` సినిమా రివ్యూ కూడా ఇవ్వు మహేషా.. పైగా నీ ఫ్యామిలీ మెంబర్ నరేశ్ కూడా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి మహేష్ `మళ్లీ పెళ్లి`పై స్పందిస్తాడా..లేదా.. అన్నది చూడాలి.